AP: నెల్లూరు GGH ఘటనపై విద్యుత్ శాఖ స్పందించింది. ప్రసూతి వార్డులోని ఓ గదిలో ఏసీ బ్లాస్ట్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపింది. దీంతో పక్కనే ఉన్న బెడ్లపై నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగినట్లు పేర్కొంది. ఆసుపత్రిలోని మిగతా అన్ని వార్డులకు విద్యుత్ సరఫరా కొనసాగుతోందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే GGHకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.