RR: షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రజల అవసరాలను గుర్తించిన కౌన్సిలర్ రిజ్వానా బేగం ముబారక్ అలీ ఖాన్ బోర్ ఏర్పాటు చేశారు. బోర్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని వెంటనే పరిష్కారం చూపడం అభినందనీయమని ప్రశంసించారు.