KMM: మధిరలోని అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు ఆర్య వైశ్య సంఘం నాయకులు గురువారం పాలాభిషేకం చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకమని, ఆర్యవైశ్యుల విన్నపాన్ని మన్నించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.