AP: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇటీవల మహిళా బిల్లును అడ్డుకున్నాయని, కానీ.. మహిళా హక్కులను అవి కాలరాయలేవని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ‘2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే సదుద్దేశంతో ఇటీవల బిల్లు ప్రవేశపెట్టాం. కానీ.. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ విషయంలో ఎన్డీయే కూటమి చిత్తశుద్ధితో ఉంది’ అని తెలిపారు.