SKLM: ప్రకృతి వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏడీఏ జగన్నాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురంలో ఆయన పొలాలను సందర్శించారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గి, అనారోగ్య సమస్యలు వస్తాయని రైతులకు వివరించారు. వీటికి బదులుగా జీవామృతం వంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడితే నాణ్యమైన పంట వస్తుందని తెలిపారు.