JN: విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు సంస్కృతిపై అవగాహన కల్పించాలని కొడకండ్ల గురుకుల ప్రిన్సిపాల్ తమ్మీ దిలీప్ కుమార్ అన్నారు. ఇవాళ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులను చారిత్రక వేయి స్తంభాల గుడి, భద్రకాళి గుడి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయా కట్టడాల చరిత్రను, ప్రాముఖ్యతను వివరించారు.