E.G: గోపాలపురం నల్లజర్ల మీనార్ మసీద్‌లో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో MLA మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సామాజిక ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆ అల్లా కరుణాకటాక్షాలతో గోపాలపురం నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి ప్రార్థనలు చేశారు.