ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా పని చేసిన శ్యామల దేవి పదవి విరమణ పొందారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో శ్యామలాదేవి చేసిన సేవలు గొప్పవని అన్నారు. ప్రతి ఉద్యోగి వృత్తిలో నిమగ్నమై పని చేయాలని కోరారు.