TG: హైదరాబాద్ గంధంగూడలోని మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అలాంటిది ప్రభుత్వమే ఇళ్ల కూల్చివేతకు దిగడం దారుణమన్నారు. మూసీ సుందరీకరణ ముఖ్యమేనని.. కానీ విధ్వంసం వద్దని సూచించారు. మూసీ సుందరీకరణ కోసం జనం కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు.