SRPT: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని బెదిరించి బంగారం దోచుకెళ్లిన ఘటన నడిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన అనసూర్యమ్మ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమెను బెదిరించి మెడలోని 10 గ్రాముల నల్లపూసల తాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు ఎస్సై అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.