KMM: మధిరలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. కార్యాలయ భవన మరమ్మతులు సౌకర్యాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.