ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఆయుష్షు హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ ఆయుష్ హోమం చేయడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య వ్యాధులను మరియు మానసిక రుగ్మతలను కూడా నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విజయరాజు పాల్గొన్నారు.