AP: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై విచారణకు ఆదేశించామని హోంమంత్రి అనిత అన్నారు. ‘ఘటన అనంతరం చంద్రబాబు వేగంగా స్పందించారు. అధికారులు సహా మంత్రులను అప్రమత్తం చేశారు. బాణాసంచా ప్రమాదంపై విచారణకు ఆదేశించాం. యాజమాన్యం ఆస్తులు జప్తు చేస్తాం, బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. బాధితులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి’ అని పేర్కొన్నారు.