కడప: జిల్లాలో ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులో సరైన పత్రాలు లేకుండా కారులో భారీగా నగదు తరలిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని కడప ఖజానా కార్యాలయానికి అప్పగించారు. ఈ నగదుకు సంబంధించిన బిల్లులపై ఐటీ శాఖ విచారణ చేపట్టినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు.