TG: మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లికి చేరుకున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత మల్లోజుల స్వగ్రామానికి రావడం ఇదే తొలిసారి. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి మంచిచెడ్డలు తెలుసుకున్నారు. కాగా ఇటీవల 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల వద్ద ఆయన లొంగిపోయిన విషయం తెలిసిందే.