MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాను బట్టి రాష్ట్రంలో బీసీలకు నిధులను కేటాయించాలని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలలో ఉన్న ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు