అన్నమయ్య: చిన్నమండెంలో చాకిబండలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ పుణ్యకార్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.