PPM: గుమ్మలక్ష్మీపురం గ్రామపంచాయతీలో వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ‘క్రాస్ ప్రోగ్రాం’ కింద ఆరు బోర్లను మరమ్మత్తు చేశారు. రజక వీధి, చింతలగూడ వీధి, అంగన్వాడి కేంద్రం, గడ్డి కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు ప్రాంతం, స్మశానం ప్రాంతాల్లో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.