BDK: భద్రాచలం పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వాడపర్తి సురేష్,షేక్ షఫీర్ పాషాలను బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కరకట్ట సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుబడిన వీరి నుంచి రూ. 45 వేల విలువైన కిలో గంజాయి, బైక్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.