VZM: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న 2 బలోరో వాహనాలను, 4 ఎద్దులు, 8 ఆవులను స్వాధీనం చేసుకున్నట్లు రాజాం SI ఉమా మహేశ్వరరావు తెలిపారు. బుధవారం పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో అంతకాపల్లి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి 2 బొలెరో వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువులను స్వాదీనం చేసుకుని గరివిడి గోశాలకు తరలించినట్లు తెలిపారు.