TG: ఈనెల 15 నుంచి సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో TRS చీఫ్ కవిత ‘బాయి బాట’ పేరుతో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆమె సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనులను సందర్శించి.. అక్కడ పనిచేసే కార్మికులతో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత కార్యక్రమంలో భాగంగా 6 రోజుల పాటు 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పర్యటన కొనసాగనుంది.