BPT: భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ కొత్త ఎస్ఐగా అమీర్ బుధవారం చార్జ్ తీసుకున్నారు. గుంటూరు విజిలెన్స్ నుండి బదిలీపై ఆయన ఇక్కడికి రాగా, ఇక్కడ పనిచేసిన ఎస్సై శివయ్య చౌడాయపాలెం బదిలీ అయ్యారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడతానని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అమీర్ హెచ్చరించారు.