BPT: చుండూరు నూతన ఎస్సైగా అనిల్ కుమార్ బుధవారం పదవిని చేపట్టారు. గతంలో చీరాల వన్‌టౌన్‌లో పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలను కాపాడతామని, అసాంఘిక కార్యకలాపాలను అణచివేస్తామని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగ్గా హెల్మెట్, సరైన పత్రాలు కలిగి ఉండాలని, లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.