PLD: గురజాల వైసీపీ ఆఫీసులో మంగళవారం జరిగిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ప్రసంగించారు. కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులపై బూత్ స్థాయి నుంచే కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ అంతా చట్టప్రకారం పక్కాగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.