ASR: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీకి చెందిన పల్లాల వెంకటేశ్వర్లు (32)వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఉల్లిగుంటలొద్దిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వడదెబ్బకు గురై పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన చెందారు.