SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామం దళితవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. చాలా రోజులుగా మురుగునీటి కాలువల్లో పూడికలు తొలగించలేదని.. ఫలితంగా పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని వాపోతున్నారు. ఈగలు, దోమల బెడద పెరిగిందని, దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.