PPM: పార్వతీపురం మున్సిపాలిటీలోని 21వ వార్డులో గల కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు వార్డులో పర్యటించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేధావులు మౌనంగా ఉంటే మూర్ఖులు మున్సిపాలిటీని పరిపాలిస్తారన్నారు.