WGL: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్సై సాయిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది దామోదర్, సోము, రంజిత్, అజేయ, రవి, కల్పన రెడ్డి, విజయసాగర్, సిబ్బంది పాల్గొన్నారు.