SRCL: వేములవాడ మున్సిపాలిటీ 15వ వార్డు లాలపల్లి ప్రజల విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. TGNPDCL నిబంధనల ప్రకారం రూ.4,000 కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులకు అదనపు భారం లేకుండా ప్రభుత్వం కిలోమీటరు మేర ఉచితంగా కొత్త విద్యుత్ స్తంభాలు మంజూరు చేసింది. పనులను మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు.