TG: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అలాగే మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో, బీజేపీ ఆఫీసులో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమరవీరుల స్మరణతో పాటు తెలంగాణ సాధన ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.