PDPL: పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు సీపెల్లి రవీందర్, మండల కన్వీనర్ అడారీ నర్సింగరావు డిమాండ్ చేశారు. సోమవారం CITU ఆధ్వర్యంలో అంతర్గాం MPDOకు వినతి పత్రం ఇచ్చారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని, 3 నెలల బకాయిలు విడుదల చేయాలన్నారు.