ఖమ్మం: మధిరకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మెర రామ్మూర్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయనపై 120కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆరు సార్లు జైలు జీవితం గడిపిన ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడుతున్నారు.