ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్ రోడ్డుపై అర్ధరాత్రి కొందరు యువకులు ట్రిపుల్ రైడింగ్‌తో పాటు ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ, టపాసులు కాలుస్తూ హల్చల్ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టూ-టౌన్ పోలీసులు ఏడుగురు యువకులపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి ఐదు బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు.