HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను నేడు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి సందర్శించి కాసేపు విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని వైస్ ఛాన్సలర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.