ATP: అనంతపురం ఆర్ట్స్ కళాశాల సమీపాన ఏపీ రెడ్డి సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల ఇవాళ సందర్శించారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల కోసం మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.