ATP: బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, నాణ్యతను పరిశీలించారు.