AP: DSC-2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు అవాస్తవమని AP స్ట్పోర్ట్స్ స్పెషల్ CS అజయ్ జైన్ స్పష్టం చేశారు. DSCలో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా క్రీడల్లో 3% రిజర్వేషన్లో 431 పోస్టులు కేటాయించామని, మెరిట్ లిస్టులో 382 మందిని స్టేట్ లెవల్ కమిటీ ఎంపిక చేసిందని, మరో 39 పోస్టులు ఖాళీగానే ఉన్నాయని వెల్లడించారు. ఎంపిక అంతా సక్రమంగానే జరిగిందని తెలిపారు.