TG: హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి మరోసారి భారీ ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో ఎకరం ధర రూ.204 కోట్లు పలికింది. ఐటీ కారిడార్లో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా టీజీఐఐసీకి రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రెండ్రోజుల క్రితం జరిగిన వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో కలిపి టీజీఐఐసీ ఖజానాకు దాదాపు రూ.2500 కోట్ల ఆదాయం వచ్చినట్లైంది.