MBNR: కోయిల్కొండ మండల ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు బదిలీ పత్రాలను ఎంపీడీవో ధనుంజయగౌడ్ అందజేశారు. ఐదేళ్లపాటు సేవలందించిన కార్యదర్శులు నూతన గ్రామ పంచాయతీల్లో.. బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బదిలీ పొందిన కార్యదర్శులకు ఎంపీడీవో శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త స్థానాల్లోనూ.. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.