గద్వాల బస్టాండ్లో ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వాడకం వల్ల గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని న్యాయవాదులు రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ స్వామి తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏడీఎం, తదితరులు పాల్గొన్నారు.