TG: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే జైలుకు పంపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం రేవంత్, మంత్రి వివేక్ తనను అక్రమంగా టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలోనే 226 కేసులు భరించానని, జైలుకు భయపడనన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తెలంగాణ భవనంలోనే ఉన్నానని.. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుమన్ స్పష్టం చేశారు.