VZM: బొబ్బిలి పట్టణానికి రూ. 123.9 కోట్ల వ్యయంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు (బేబీ నాయన) భూమిపూజ నిర్వహించారు. సీతానగరం మండలంలో సువర్ణముఖి నది నుంచి బొబ్బిలికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.