యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ‘టాక్సిక్’ మూవీ సెట్ అనుభవాలను నటి కియారా పంచుకుంది. సెట్లోకి రాగానే ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పొద్దని.. నేరుగా క్యారెక్టర్ జోన్లోకి వెళ్లాలని డైరెక్టర్ గీతూ స్ట్రిక్ట్‌గా చెప్పిందట. ఉత్సాహంగా అందరినీ పలకరించే తనకు ఈ నిబంధన కొత్తగా అనిపించిందని, గీతూ నిబద్ధతకు షాకయ్యానని కియారా చెప్పుకొచ్చింది.