»Balagam Movie Trailer Launched By Vijay Devarakonda
Balagam Movie భావోద్వేగాల ‘బలగం‘.. ట్రైలర్ సూపర్బ్
తెలంగాణ పల్లె నేపథ్యంలో ఉంది. దర్శి పక్కన హీరోయిన్ గా కావ్య కల్యాణ్ రామ్ నటిస్తుండగా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ ను చూస్తే కొమురయ్య పాత్ర చుట్టూ సినిమా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్న కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతున్నది.
‘ఊరూ పల్లెటూరు’ అనే పాటతో ‘బలగం’ (Balagam Movie) సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. తెలంగాణ (Telangana) పల్లెటూరు నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి (Venu Yeldandi) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయించారు.
మల్లేశం (Mallesham Movie) సినిమాతో హీరోగా హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి హీరో పాత్రలో మెరిశాడు. ఈ సినిమా కూడా తెలంగాణ పల్లె నేపథ్యంలో ఉంది. దర్శి పక్కన హీరోయిన్ గా కావ్య కల్యాణ్ రామ్ (Kavya Kalyanram) నటిస్తుండగా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ (Trailer)ను చూస్తే కొమురయ్య పాత్ర చుట్టూ సినిమా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్న కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదల చేయగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఊరు పల్లెటూరు పాట తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విదేశాల్లో ఉన్నవారు ఈ పాటతో తమ ఊరు గుర్తుకు వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలోని ‘పొట్టి పిల్ల’ (Pottipilla Song), ‘బలరామ నర్సయ్యో’ (Balarama Narsayyo Song) అనే పాటలు ఆకట్టుకుంటున్నాయి. ధమాకా (Dhamaka)తో కెరీర్ లో సూపర్ హిట్ అందుకున్న తెలంగాణ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరిలియో (Bheems Cicirolio) ఈ సినిమాకు సంగీతం అందించాడు. మరోసారి పల్లెదనంతో కూడిన సంగీతం ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) అద్భుతంగా సాహిత్యం అందించాడు.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ (Censor) కూడా పూర్తయ్యింది. ‘తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. ఇది సినిమా కాదు. నిజ జీవితం. బొమ్మరిల్లు, శతమానం భవతీ మాదిరిగా బలగం సినిమా గుర్తుండిపోతుంది. ప్రతీ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగంతో నింపుతుంది. కొత్త కాన్సెప్ట్ సినిమాలతో, కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నా’ అని నిర్మాత దిల్ రాజ్ తెలిపాడు. కాగా జబర్దస్త్ లో హాస్య నటుడిగా ప్రేక్షకులను నవ్వించిన వేణు ఎల్దండి దర్శకుడిగా మారడం విశేషం. నటుడిగా చాలా సినిమాల్లో నటించిన వేణు తొలిసారి మైక్ అందుకున్నాడు. అయితే ట్రైలర్ ను చూస్తుంటే వేణు దర్శకుడిగా విజయం అందుకోబోతున్నాడని తెలుస్తున్నది. తెలుగుదనంతో నిండిన ఈ సినిమాను మార్చి 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చిన్న సినిమాగా వస్తున్నా కూడా ప్రేక్షకులు ఈ సినిమాపై చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.
చదవండి: బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు