ఉమ్మడి ప.గో: జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను ZP ఛైర్పర్సన్ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. ప్రభుత్వ సత్వర నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.