KRNL: నూతన సంవత్సరం సందర్భంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పత్తికొండ పట్టణంలోని ఆది ఆంధ్ర స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు, సోమశేఖర్, శ్రీరంగడు, కారం నాగరాజు, టీఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.