MDK: రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మహిళ బ్యాగులో నుంచి 4.5 తులాల బంగారం అపహరించగా, కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు. కర్ణాటకకు చెందిన శ్వేత కాలేజ్ (23), మహారాష్ట్రకు చెందిన శిల్ప వేలు (20)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.