రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. అయితే జూన్ 3నే తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా ఒక షో వేసే చోట, ఈసారి సాయంత్రం 6:55కు ఒకటి, రాత్రి 10:30కు మరొకటి.. ఇలా రెండు షోలు ప్రదర్శించనున్నారట. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక జీవో తెచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.