TG: చివరి గింజ వరకు కొంటామని కాంగ్రెస్ మోసం చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ విధానాల్లా ఉన్నాయని విమర్శించారు. హామీ మేరకు నాలుగైదు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. రేవంత్‌కు దమ్ముంటే.. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.