ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలు ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ హాజరు నమోదు కోసం ఉపయోగించే మొబైల్ అనువర్తనం సరిగా పనిచేయకపోవడంతో కూలీలు పనిస్థలాల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. పాత విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.